రోమన్ లో 2000 సంవత్సరల క్రితమే మలేరియా telugunews
రోమన్ లో 2000 సంవత్సరల క్రితమే మలేరియా telugunewsఈ మధ్య కాలంలో ఇటలీయాన్ సమాధుల నుండి భయటపడిన మానవ పళ్ళను సేకరించి పరిశీలన చేసిన శాస్త్రవేత్తలు చేప్పిన ప్రకారం మలేరియా వ్యాది 2000 సంవత్సరలా క్రితమే రోమన్ సామ్రాజ్యంలో చాలా మంది ప్రజలను మరణానికి గురిచేసిందటా.
మలేరియా చాలా ప్రమాదకరమైన వ్యాధి ఇది కొన్ని పరాన్న జీవులు మరియు కొన్ని ప్రమాదకరమైన దోమల వలన వ్యాపించే వ్యాధి. 2015లో ప్రపంచవ్యాప్తంగా 214 మిలియన్ల మలేరియా కేసులు నమోదయాయి.4,38,000 మంది మరణించారు దీనిలో ఎక్కూవ మంది పిల్లలే వున్నారు.
వ్యాధి నియంత్రణ మరియు వ్యాధి నివారణ కేంద్రాలు ప్రకారం ,ఇంతకు ముందు చేసిన పరిశోధన పరిశీలిస్తే రోమన్ సామ్రాజ్యం సమయంలో ఇటలీని బాధించినా అతి పెద్ద వ్యాధి ఇదే అని సూచించారు.ఇదంత ప్రాచీన రచయితలు ,పురాతన మానవ అస్థిపంజర అవశేషా ఆధారాలు చేప్తున్నాయి . కాని అప్పుడు వున్న రోమన్ సామ్రాజ్యంకు మలేరియాకు కారణాలు(పరన్నజీవులు) ఎంటో తెలియదు.
శాస్త్రవేత్తలు 58 మంది పెద్దలు ,10 మంది పిల్లల శరీర అస్థిపంజరం నుండి పళ్ళను తీసుకొని ఆ పళ్ళ గుజ్జు నుండి డి.ఎన్.ఎ భాగాలను పరిశీలించరు.దీని ద్వార మలేరియా 2000 సంవత్సరాల్ క్రితమే రోమన్ సామ్రాజ్యంలో వుందని తెలిసింది.
No comments:
Write comments